TS Covid-19 Media Bulletin 04-04-2021
తెలంగాణలో 1321 కొత్త కరోనా కేసులు
తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 8000కు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 62,973 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,321 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి కరోనా సోకిన వారి సంఖ్య 3,12,140కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,923 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
తాజాగా కరోనాతో ఐదుగురు మృతి
చెందగా, ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,717కి చేరింది. నిన్న
293 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3,886 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ
పరిధిలోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా 320 కరోనా కేసులు నమోదయ్యాయి.
0 Komentar