TS: ప్రైవేటు వైద్య
కళాశాలల్లో కొవిడ్ చికిత్స - వైద్య కళాశాలల యాజమాన్యాలతో వైద్యారోగ్య
శాఖ మంత్రి భేటీ
తెలంగాణలోని ప్రైవేటు వైద్య
కళాశాలల్లో కొవిడ్ చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు
తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రైవేటు వైద్య కళాశాలల
సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రైవేటు వైద్య కళాశాలల
యాజమాన్యాలతో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. కొవిడ్
చికిత్సలు, ఆస్పత్రుల్లో పడకల ఛార్జీలు, సిబ్బంది
కేటాయింపు, ఫీజుల వసూళ్లపై వారితో చర్చిస్తున్నట్లు సమాచారం.
ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నర్సింగ్ హోంల ప్రతినిధులతోనూ మంత్రి భేటీ
కానున్నట్లు తెలుస్తోంది.
0 Komentar