Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోండి – హైకోర్టు

 

TS: నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోండి – హైకోర్టు

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌పై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా కొవిడ్‌ పరిస్థితులను ప్రభుత్వం అన్ని విధాలుగా పర్యవేక్షిస్తోందని ఏజీ కోర్టు దృష్టి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ‘పర్యవేక్షణ కాదు.. చర్యలు ఉండాలి. కరోనాపై ప్రజలకు అన్నీ తెలిశాయి. ప్రభుత్వానికే తెలియాలి. ఎన్నికల ర్యాలీలు, వివాహాలు, అంత్యక్రియలో రద్దీ నియంత్రణపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదు. ప్రజల్లో ప్రభుత్వం విశ్వాసం నింపలేకపోతోంది. వార్డుల వారీగా అత్యవసర బృందాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారా? కుటుంబమంతా కరోనా బారినపడితే ఏవిధంగా సాయం చేస్తున్నారు.

ఆర్టీపీసీఆర్‌ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఈనెల 22లోగా అన్ని వివరాలతో నివేదిక సమర్పించాలి’ అని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

మూడు రోజులు సరిపోవని, మరింత సమయం కావాలని ఏజీ కోరగా, ‘మూడు రోజుల్లో మీరు చేయగలిగింది చేయండి.. మిగతాది మేము చేస్తాం’ అని తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. తాజా విచారణ సందర్భంగా హాజరైన వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి రిజ్వీ, డీహెచ్ శ్రీనివాస్‌రావులు ఈ నెల 23న జరిగే విచారణకూ  కూడా హాజరు కావాలని ఆదేశించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags