TS: వచ్చే వారం నుంచి
టెన్త్ ప్రత్యక్ష తరగతులు!
టెన్త్ విద్యార్థులకు ప్రత్యక్ష
తరగతులను వచ్చే వారం ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఫిబ్రవరి-1
నుంచి ప్రారంభమైన తరగతులు మార్చి 23 వరకు కొనసాగిన విషయం
తెలిసిందే. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 44 పనిదినాల్లో మాత్రమే ప్రత్యక్ష తరగతులు సాగాయి.
కరోనా వైరస్ వ్యాప్తి మరింత
పెరుగుతుండటం, స్కూళ్లలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు కరోనా బారిన
పడటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ
నేపథ్యంలోనే మార్చి 23వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులకు
మళ్లీ ఆన్‌లైన్ తరగతులు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
వార్షిక పరీక్షలు మే 17
నుంచి 26 వరకు జరగాల్సి ఉంది. దీనికి మరో 35 రోజులు మాత్రమే గడువు ఉండడంతో కనీసం పదో తరగతి విద్యార్థులకు
సాధ్యమైనన్ని ఎక్కువ ప్రత్యక్ష తరగతులు జరిగేలా చూడాలని విద్యాశాఖ భావిస్తోంది.
వచ్చే వారం 8 నుంచి ప్రారంభిస్తే మరో 28 రోజుల పాటు తరగతులు ఉంటాయని విద్యాశాఖ నిర్ణయించినట్టు తెలిసింది.
0 Komentar