TS: Enhancing the age of superannuation
– Adoption by other Organizations under Government
ప్రభుత్వ రంగ ఉద్యోగులకూ పదవీ
విరమణ వయసు పెంపు - ఆర్టీసీ సింగరేణి, విద్యుత్ తదితర సంస్థల
వారికి లబ్ధి
రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల
ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసు 61
ఏళ్లను పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఆర్టీసీ, సింగరేణి,
విద్యుత్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు, విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బందికీ దీనిని వర్తింపజేసేందుకు
అనుమతిస్తూ ఆదివారం ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది మార్చి 30 నుంచి అన్ని శాఖల ఉద్యోగుల
పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే. దీనిని తమకు
వర్తింపజేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.
దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
61 ఏళ్ల వయోపరిమితి అమలుకు వీలుగా
సంబంధిత పాలకమండళ్లు అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించింది. అన్ని శాఖల
ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు వయోపరిమితి పెంపు నిబంధనల
అమలుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా
కార్పొరేషన్, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ
(టీఎస్‌ఐఐసీ), బెవరేజెస్ కార్పొరేషన్, పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య, టీఎస్ ఫుడ్స్,
సాంస్కృతిక, పర్యాటక, క్రీడా
ప్రాధికార సంస్థ, ఖనిజాభివృద్ధి సంస్థ, టెస్కో, హస్తకళల అభివృద్ధి సంస్థ, పౌరసరఫరాల సంస్థ, అటవీ అభివృద్ధి సంస్థ, ఐడీసీలు, అన్ని విశ్వవిద్యాలయాలు, ఆర్టీసీ, ట్రాన్స్‌కో, జెన్‌కో,
విద్యుత్ పంపిణీ సంస్థలు, సింగరేణి తదితర
సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది.
Cir.Memo.No: 705517/161/A1/HRM-III/2020
Dated: 4-4-2021
Sub: Telangana Act No.3 of 2021 –
Enhancing the age of superannuation – Adoption by other Organizations under
Government – Reg
0 Komentar