TS: 449 వైద్య సిబ్బంది భర్తీకి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణలోని కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన సిబ్బంది నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రానున్న మూడు నెలలపాటు సేవలు అందించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని వివిధ విభాగాల్లో 449 ఉద్యోగాలు భర్తీ చేసుకోడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఒప్పంద ప్రాతిపదికన 78 మంది, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 371 మందిని నియమించుకునేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తం ఉద్యోగాల్లో అసిస్టెంట్
ప్రొఫెసర్లు, అనస్థీషియా విభాగంలో 32 మందిని
ప్రభుత్వం నియమించుకోనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు (జనరల్ మెడిసిన్) 25 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లు (పల్మనరీ మెడిసిన్)
21 మందిని ఒప్పంద ప్రాతిపదికన నియమింనుంది. అదే విధంగా
స్టాఫ్ నర్సులు 315 మంది, ల్యాబ్
టెక్నీషియన్లు 56 మందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ
చేయనుంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ముఖాముఖి
నిర్వహించి భర్తీ చేస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించి
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
0 Komentar