రేపటి నుంచి తెలంగాణలో ఒంటిపూట
బడులు - టీచర్లు హాఫ్ డే స్కూల్ కు హాజరు కావాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
ఆదేశాలు
రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో ఒక్కపూటే తరగతులు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యార్థులు లేని కారణంగా టీచర్లు హాఫ్ డే స్కూల్ కు కచ్చితంగా హాజరు కావలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
కరోనా ఎఫెక్ట్‌తో
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు తాత్కాలికంగా
మూసివేసినా, ఉపాధ్యాయులు మాత్రం రెగ్యులర్‌గా వెళ్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా
విద్యాభోధన, సప్తగిరి, టీశాట్ ద్వారా
క్లాసులు నడుస్తున్నా, ఉపాధ్యాయులు మాత్రం రెగ్యులర్‌గా స్కూల్‌కు వెళ్తున్నారు.
అయితే, ఎండలు ముదిరిపోవడంతో, రేపటి
నుండి తెలంగాణలో ఉపాధ్యాయులకు ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది
ప్రభుత్వం.
ఈసారి కరోనా కారణంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10 తరగతులకు, 24వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించారు. మే 26వ తేదీ చివరి పనిదినంగా పేర్కొన్నా, కరోనా విజృంభణ నేపథ్యంలో గత నెలలోనే తాత్కాలికంగా విద్యాసంస్థలను మూసివేసింది ప్రభుత్వం. ఇక, రేపటి నుంచి ఉపాధ్యాయులకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు.
0 Komentar