ఇంటర్ విద్యార్థులకు మానసిక ఒత్తిళ్లు అధిగమించటానికి ఉచిత కౌన్సెలింగ్ - ఇంటర్ అసైన్మెంట్ల సమర్పణకు గడువు పెంపు
24 గంటలపాటు ఫోన్ లో అందుబాటులో
సైకాలజిస్టులు
ఇంటర్ విద్యార్థులు ఎదుర్కొనే
మానసిక ఒత్తిళ్లు, పరీక్షల భయం లాంటి పలు సమస్యలకు ఫోన్లో
ఉచితంగా కౌన్సెలింగ్ ఇవ్వడానికి ఏడుగురు సైకాలజిస్టు లను నియమించినట్లు ఇంటర్‌బోర్డు
కార్యదరి జలీల్ తెలిపారు. ఆదివారం (18వ తేదీ) నుంచి వారు 24 గంటలపాటు ఫోన్లో అందుబాటులో ఉంటారని, విద్యార్థులు
తమ సమస్యలకు పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.
ఇంటర్ ఎసైన్మెంట్ల సమర్పణకు గడువు
పెంపు
ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్ధులు
నైతిక,
మానవీయ విలువలు, పర్యావరణం విద్య పరీక్షలను
ఎసైన్మెంట్ల రూపంలో ఇళ్ల వద్దే రాసి కళాశాలలకు సమర్పించే గడువును ఈ నెల 30వ
తేదీ వరకు పెంచినట్లు ఇంటర్‌బోర్డు కార్య దర్శి జలీల్ శనివారం ఒక ప్రకటనలో
తెలిపారు. విద్యార్థులు సమర్పించిన అసైనెమెంట్లకు మార్కులు వేసి, తమకు మే 3వ తేదీ వరకు ఆన్లైన్లో పంపించాలని కళాశాలలకు ఆయన
సూచించారు.
0 Komentar