TS: Inter Practical Exams will be Conducted
after JEE Main-2021
టిఎస్: జేఈఈ మెయిన్ తర్వాతే
ఇంటర్ ప్రయోగ పరీక్షలు!
ఇంటర్ ప్రయోగ పరీక్షలను మేలో
జరిగే జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్షల తర్వాత నిర్వహించాలని ఇంటర్‌బోర్డు
యోచిస్తోంది. దేశవ్యాప్తంగా మే 24-28 తేదీల మధ్య మెయిన్ ఆన్‌లైన్
పరీక్షలున్నాయి. ఇంతకుముందు ఇంటర్‌బోర్డు ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఈనెల 7
నుంచి 20 వరకు ప్రాక్టికల్స్, మే 1 నుంచి 17 వరకు వార్షిక పరీక్షలు
జరగాలి. ప్రస్తుతం కళాశాలలను మూసివేసినందున ప్రయోగ పరీక్షలను ప్రారంభించడం సాధ్యం
కాదు. ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభించాలన్న ప్రతిపాదన ఉన్నా దానికీ అవకాశం లేదని
భావిస్తున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షల తర్వాత ప్రాక్టికల్స్ జరపాలన్న ప్రతిపాదనను
ఇంటర్‌బోర్డు ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని,
రెండు మూడు రోజుల్లో విద్యార్థులకు స్పష్టత ఇస్తామని అధికారులు
చెబుతున్నారు.
వివరాల్లో మార్పులు చేసుకోండి
ఇంటర్ విద్యార్థులు ఇప్పటికే
సమర్పించిన వివరాల్లో మార్పులు ఉంటే జరిమానా చెల్లించి మార్చుకోవచ్చని బోర్డు
తెలిపింది. పేరులో తప్పుల సవరణకు రూ.500, ద్వితీయ భాష, మాధ్యమం మార్చుకోడానికి రూ.వెయ్యి చొప్పున, గ్రూపు
మార్పునకు రూ.3 వేలు ఈనెల 9లోపు చెల్లించాలని బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.
0 Komentar