TS: ప్రైవేటు టీచర్ల
ఆర్థికసాయం పంపిణీకి మార్గదర్శకాలు జారీ
కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో
సతమతం అవుతున్న ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి ఆర్థికసాయం అందించేందుకు తెలంగాణ
సర్కారు ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి
అందించే ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
విద్యాసంస్థల నుంచి వివరాలను ఆన్‌లైన్‌లో తీసుకోనున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా వివరాలు నమోదు చేయాలని
స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలు
తప్పనిసరిగా సమర్పించాలని తెలిపింది. ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు,
ఇతర అధికారుల ద్వారా ఉపాధ్యాయులు, సిబ్బంది
వివరాలు డీఈవోలు తనిఖీ చేయించనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది.
పాఠశాలల నుంచి వివరాల సేకరణ: నేటి (ఏప్రిల్
10) నుంచి ఈ నెల 15 వరకు,
క్రోడీకరణ, తనిఖీ:
16వ తేదీ నుంచి 19 వరకు
అర్హుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ: ఈ నెల 20
నుంచి 24 వరకు
బియ్యం పంపిణీ: 21వ
తేదీ నుంచి 25 వరకు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
0 Komentar