TS: ఈ నెల 24 నుంచి
ఉపాధ్యాయులకు వేసవి సెలవులు ప్రకటించే అవకాశం?
ఈ నెల 24వ తేదీ నుంచి ఉపాధ్యాయులకు
వేసవి సెలవులు ప్రకటించే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అధికారులతో
చర్చించారు. సాధారణంగా ఏటా ఏప్రిల్ 22 లేదా 23వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలలు
పనిచేస్తాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ఇస్తారు.
ఈసారి పదో తరగతి పరీక్షలు ముగిసే
చివరి రోజు, అంటే మే 26 చివరి పనిదినమని గతంలో ప్రభుత్వం ప్రకటించిన
సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు.
ఉపాధ్యాయులు మాత్రం ప్రతిరోజూ విధులకు హాజరవుతున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా
వేసవి సెలవులు ప్రకటించాలని ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి
విన్నవించాయి. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీని చివరి పనిదినంగా పేర్కొని, 24వ తేదీ నుంచి (శనివారం) వేసవి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం
ఆలోచిస్తున్నట్లు సమాచారం. 1-9 తరగతుల వారిని పై తరగతులకు ప్రమోట్ చేస్తూ త్వరలో
ఉత్తర్వులు ఇవ్వనున్నారు
0 Komentar