TS: TIMS Recruitment for 199 Various Posts
'టిమ్స్'లో ఒప్పంద ఉద్యోగాలకు నోటిఫికేషన్ - ప్రొఫెసర్,
మెడికల్ ఆఫీసర్ సహా 199 పోస్టులు
కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్ (తెలంగాణ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్) ఆసుపత్రిలో పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఒప్పంద (కాంట్రాక్ట్) పద్దతిలో నియామకాలు జరపనున్నారు. ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మ సిస్ట్ తదితర విభాగాల్లో మొత్తం 199 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హు లైన అభ్యర్థులకు 16, 17, 19 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం- 3 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
టిమ్స్ లో వైద్య ఉద్యోగులు, సిబ్బంది సంఖ్యను
పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టుల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి. ప్రొఫెసర్-12,
అసోసియేట్ ప్రొఫెసర్-23, అసిస్టెంట్
ప్రొఫెసర్-22, మెడికల్ ఆఫీసర్-94, నర్సింగ్
సూపరింటెండెంట్ గ్రేడ్-2-1, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్
సూపరింటెండెంట్/ హెడ్ నర్స్- 6, స్టాఫ్ నర్స్-32, డైటీషియన్1. ఫార్మాసిస్ట్-8 పోస్టులు
ఉన్నాయి. దరఖాస్తు ఫారాలు www.dme.telangana.gov.in వెబ్
సైట్లో అందుబాటులో ఉంటాయని టిమ్స్ తెలిసింది.
0 Komentar