టిఎస్: 13 వేల మంది ఉద్యోగులకు టిఎస్‌జిఎల్‌ఐ బాండ్లు - రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్ర జీవిత బీమా
పథకం (టిఎస్‌జిఎల్‌ఐ) కింద ప్రీమియం చెల్లిస్తూ బాండ్లను తీసుకోని 13 వేల మంది
ప్రభుత్వ ఉద్యోగులు తాజాగా బాండ్లను పొందడానికి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతిస్తూ
ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు బీమా పథకంలో ప్రతిపాదించినపుడు 53
ఏళ్ల వయసు దాటినా, అంతకుముందు నుంచి రాష్ట్ర జీవిత బీమా పథకం
ప్రీమియం చెల్లించిన ఉద్యోగులకు కొత్తగా బాండ్లను జారీచేయనుండటంతో పాటు గతంలో వారు
చెల్లించిన ప్రీమియం అదనపు మొత్తాన్ని వెనక్కి చెల్లించాలని ఆర్థికశాఖ
ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బాండ్లను పొందేందుకు ఈ ఏడాది
అక్టోబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పించారు. జమ చేయాల్సిన ప్రీమియం కంటే ఎక్కువ
చెల్లించినవారికి వడ్డీ లేకుండా అదనంగా చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని
ఆదేశించారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించుకునేలా
విస్తృత ప్రచారం కల్పించాలని బీమా సంస్థ డైరెక్టర్‌ను ఆదేశించారు. టిఎస్‌జిఎల్‌ఐ పథకం బాండ్లు పొందకపోవడంతో నష్టపోతున్న 13888 మంది ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని
కోరుతూ గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కె.జనార్దనరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా
ఆర్థికశాఖ ఈ మేరకు చర్యలు తీసుకుంది.
G.O 904 Dated: 26-04-2021
0 Komentar