TSMJBC RJC & RDC – 2021 Notification
Released – Apply Now
ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యనందించేందుకు మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాలను స్థాపించింది. వీటి ద్వారా ఇంటర్మీడియట్, డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలను ఏర్పాటు చేసింది. ఆర్థిక స్తోమత లేని ఎంతోమంది పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. తాజాగా వీటిలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ప్రవేశపరీక్ష ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్టేసీ & ఆర్డీసీ సెట్-2021లో ప్రతిభ కనబరిస్తే ఇంటర్, డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చు. పైసా ఖర్చు లేకుండా బోధన, వసతి, భోజనం తదితర సౌకర్యాలు అందుతాయి.
కోర్సులు -
అర్హత
ఇంటర్మీడియట్ (ఇంగ్లీష్ మీడియం)లో
ఎంపీసీ,
బైపీసీ, సీఈసీ, హెచ్ ఈసీ,
ఎంఈసీ, ఇతర వృత్తి విద్యా -కోర్సులు
అందుబాటులో ఉన్నాయి. వీటిలో చేరడానికి 2021-22
విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు. తెలంగాణ
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 134 కళాశాలల్లో ప్రవేశాలు
కల్పిస్తారు. ఇందులో బాలుర కళాశాలలు 66, బాలికలకు సంబంధించి 68 విద్యాలయాలు ఉన్నాయి.
మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి ఏడాది (ఇంగ్లీష్ మీడియం)లో చేరడానికి మహిళలకే అవకాశం ఉంది. బీఎస్సీ-ఎంపీసీ, ఎంఎస్సీఎస్, ఎంపీసీఎస్, బీజడ్సీ, బీబీసీ, డేటా సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఎంపిక విధానం:
మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ
వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే ఆర్టేసీ & ఆర్డీసీ సెట్ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా
ఎంపికలు చేపడతారు. ఆయా కళాశాలల్లో బీసీలకు 75శాతం, ఎస్సీలకు
15, ఎస్టీలకు 5, ఈబీసీలకు 2, అనాథలు, దివ్యాంగులకు 3 శాతం చొప్పున సీట్లు
కేటాయిస్తారు. ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకునేటప్పుడే ఏ కోర్సు ఎంచుకుంటున్నారో
తెలపాల్సి ఉంటుంది. దాన్ని బట్టి పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్
చేసి ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తు విధానం:
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి. రూ.200 చెల్లించాలి.
పరీక్షల తేదీలు:
ఆర్‌జేసి సెట్-2021: జూన్ 12, 2021న 10AM to 12.30PM.
ఆర్‌డిసి సెట్-2021: జూన్ 13, 2021న 10AM to 12.30PM.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 31, 2021.
TSMJBC RJC – 2021
TSMJBC RDC - 2021
0 Komentar