TSWREIS Entrance Test 2021 for Degree Courses
Admission with Military Education for Women
సైనిక మహిళా కళాశాల – బిఎస్‌సి, బిఏ
కోర్సులలో ప్రవేశాలకు ప్రకటన
దేశ రక్షణలో భాగంగా త్రివిధ
దళాల్లో (ఆర్మీ, నేవీ, ఏరోఫోర్స్) మహిళలకు
అవకాశాలు పెరిగాయి. విద్యార్థినులకు ఈ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో యాదాద్రి
భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవాపురం శివారులో తెలంగాణ సాంఘిక సంక్షేమ
గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల తర్ఫీదునిస్తోంది.
ఇక్కడ ఉచిత విద్యాబోధనతో పాటు
మహిళలను మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేసి దేశరక్షణలో
భాగస్వాములను చేసేందుకు సైనిక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో ప్రవేశ ప్రకటన విడుదలైంది.
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల
మహిళా డిగ్రీ కళాశాల ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఆ
డిగ్రీ కళాశాలను 2018 అక్టోబరులో తెలంగాణ సోషల్ వెల్ ఫెర్
రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ (TSWRAFPDCW) గా మార్చారు. ప్రస్తుతం 376 మంది డిగ్రీ విద్యార్థినులు సైనిక శిక్షణ
పొందుతున్నారు. ఈ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు గోపు చాముండేశ్వరి
(బెల్లంపల్లి), డప్పు లయ (సంగారెడ్డి), బొంతు సీతారావమ్మ (ఖమ్మం), తేజశ్రీ (మహబూబ్ నగర్)లు
ఏరోఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ లో అర్హత సాధించారు.
శిక్షణ తీరు: జాతీయస్థాయి సైనిక
శిక్షణకు ఏ మాత్రం తీసిపోకుండా తర్ఫీదు ఇస్తున్నారు. ఇందుకు అవసరమైన వ్యాయామశాల, మైదానం,
పరికరాలు ఇక్కడ ఉన్నాయి. రోజూ ఉదయం 4 గంటల నుంచి 1 గంటల వరకు సైనిక
శిక్షణ లభిస్తుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు డిగ్రీ తరగతులు ఉంటాయి. అనంతరం 5
గంటల వరకు సైనిక శిక్షణ ఇస్తారు. మొత్తంగా విద్యార్థినులకు డిగ్రీ కోర్సులతో పాటు
మేజర్ ఉషాకుమార్ శర్మ ఆధ్వర్యంలో నలుగురు శిక్షకులతో తర్ఫీదు ఇప్పిస్తున్నారు.
కోర్సులు:
బీఎస్సీ: ఎంపీసీ
బీఏ: హెచ్ ఈసీ
అర్హతలు & దరఖాస్తు విధానం:
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థినులకు
అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలనే
విద్యార్థినులు కనీసం 5.2 అడుగుల ఎత్తు, 45-50 కిలోల బరువు ఉండాలి. విజన్, ఫిజికల్ పరీక్షలతోపాటు
రాత పరీక్షలు నిర్వహించి మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ చేసి ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తున్నారు.
కళాశాలకు ఆదరణ పెరుగుతుండటంతో ఈ సంవత్సరం ఒక్కో కోర్సుకు 120 మంది చొప్పున 240 మంది విద్యార్థినులకు అవకాశం
కల్పించారు.
దరఖాస్తు ప్రక్రియ విధానం: ఆన్లైన్
(రూ.100
ఫీజు)
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: ఏప్రిల్
18వ తేదీ నుంచి,
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: మే 31
వరకు
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు
0 Komentar