TU CIBIL to Provide Lenders Score of
First-Time Borrowers
కొత్త రుణగ్రహీతలకూ క్రెడిట్ స్కోరు - ఎన్‌టీసీని (NTC) ప్రారంభించిన ట్రాన్స్‌యూనియన్ సిబిల్ (CIBIL)
కొత్తగా అప్పు కోసం దరఖాస్తు
చేసుకునేవారిపై బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు ఒక అవగాహనకు వచ్చేందుకు
వీలుగా క్రెడిట్ విజన్ న్యూ టు క్రెడిట్ (ఎన్‌టీసీ) స్కోరు అందుబాటులోకి
తెస్తున్నట్లు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ వెల్లడించింది. ఈ ఎన్‌టీసీతో వినియోగదారుల
అర్హతను నిర్ణయించడం రుణదాతలకు సులువు అవుతుందని పేర్కొంది. ఎలాంటి అప్పులు లేని
వారికి క్రెడిట్ స్కోరు, రుణ చరిత్రలాంటివి ఉండవు. కాబట్టి,
అలాంటి వారి గురించి అంచనా వేయడం రుణ సంస్థలకు చిక్కుగానే ఉంటుంది.
ఈ కొత్త స్కోరింగ్‌ను
వినియోగదారుడి గురించి అందుబాటులో ఉన్న వివిధ సమాచారం ఆధారంగా నిర్ణయిస్తారు. ఇది 101-200 శ్రేణిలో ఉంటుంది. అత్యధిక విలువ ఉంటే తక్కువ రిస్క్ ఉన్నట్లు. స్వల్ప
స్కోరు ఉంటే.. రుణగ్రహీత చెల్లింపు జరపలేకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని
వెల్లడిస్తుంది. ఈ స్కోరు క్రెడిట్ సంస్థలు, బ్యాంకులు
ఉపయోగించుకునేందుకు వీలుంటుంది.
CreditVision® NTC Score will enable credit institutions to assess the eligibility of new-to-credit (NTC) consumers who have never taken a loan or credit card from banks or financial institutions before. Read more: https://t.co/YgSddPsmPw pic.twitter.com/fnB0iuNrze
— TransUnion CIBIL (@TransUnionCIBIL) April 20, 2021
0 Komentar