WhatsApp లో రెండు కొత్త
సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయి - రెండూ కూడా అతి కీలకమైనవే
1. WhatsApp – Android, iOS Back Up Feature:
Android, iOS ఆపరేటింగ్
సిస్టమ్ ఆధారంగా పనిచేసే iPhoneలకి మారే వారికి తరచూ ఏర్పడే
అతి పెద్ద సమస్య iOSలో అప్పటి వరకూ ఉన్న వాట్సప్ ఛాట్
బ్యాకప్ Androidలో రాకపోవడం, Androidలో
ఉన్న ఛాట్ బ్యాకప్ iOSలోకి బదిలీ అవకపోవడం! దీని కోసం
చాలామంది అనేక థర్డ్-పార్టీ అప్లికేషన్స్ ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో Whatsapp
అలాంటి ఇతర అప్లికేషన్స్ తమ నియమాలను ఉల్లంఘించాయని, అలాంటివాటిని వాడొద్దని వినియోగదారులను హెచ్చరిస్తూ తనకు తానే స్వయంగా ఈ
కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వస్తోంది.
దీనిద్వారా ఇకమీదట మీరు Android phone నుండి iPhoneకి మారుతున్నా, iPhone నుండి Androidకి మారుతున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా
చాలా సులభంగా అప్పటివరకు ఉన్న ఛాట్ బ్యాకప్ మొత్తాన్నీ కొత్త ఫోన్ లోకి
ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
2. WhatsApp Web New Feature:
దీంతోపాటు కొంతమంది అధిక సమయం
డెస్క్టాప్ కంప్యూటర్ మీద గడుపుతూ ఉండటం వల్ల Whatsapp Web ఎక్కువగా
వినియోగిస్తుంటారు. అలాంటి వారు Whatsapp Webలో యాక్టివ్‌గా
ఉండాలంటే వాట్సప్ ఇన్స్టాల్ చేయబడి ఉన్న మొబైల్ ఫోన్‌కి ఇంటర్నెట్ కనెక్షన్
అవసరమవుతుంది. ఇక మీదట దీంతో సంబంధం లేకుండా, ఒకసారి ఒక
నెంబర్ మీద వాట్స్అప్ వెబ్‌ని యాక్టివేట్ చేసిన తర్వాత, ఒకవేళ
సంబంధిత ఫోన్ నెంబర్ ఉన్న ఫోన్ నెట్‌కి కనెక్ట్ అయి లేకపోయినప్పటికీ ఎలాంటి
ఇబ్బంది లేకుండా ఆ వాట్స్అప్ వెబ్ పనిచేసే విధంగా Whatsapp కొత్త
సదుపాయం అందుబాటులోకి తీసుకు వస్తోంది.
0 Komentar