UPSC CAPFs Assistant Commandant Exam-2021 Registration Begins
యూపిఎస్‌సి - సెంట్రల్ ఆర్మ్ డ్
పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్-2021
బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్,
సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎఎస్
బీ కేంద్ర సాయుధ బలగాల్లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్
సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సీఏపీఎఫ్-2021 ప్రకటన విడుదల చేసింది.
అసిస్టెంట్ కమాండెంట్
మొత్తం ఖాళీలు: 159
1) బీఎస్ఎఫ్: 78
2) సీఆర్పీ ఎఫ్: 36
3) సీఐఎస్ఎఫ్: 67
4) ఐటీబీపీ: 20
5) ఎస్‌ఎస్‌బి : 01
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/
తత్సమాన ఉత్తీర్ణత. 2021లో డిగ్రీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు
చేసుకోవచ్చు. సీఏపీఎఫ్ పరీక్ష 2021కి కావల్సిన నిర్దిష్ట శారీరక, ఆరోగ్య
ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 01.08.2021 నాటికి 20-25
ఏళ్ల మధ్య ఉండాలి. 02.08.1996-01.08.2001 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్
ఎఫిషియన్సీ టెస్ట్/ మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఇంటర్వ్యూ
/ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం: దీనిలో రెండు
పేపర్లు ఉంటాయి. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు, పేపర్-2
పరీక్ష మధ్యాహ్నాం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు.
పేపర్-1లో జనరల్ ఎబిలిటీ, ఇంటలిజెన్స్
విభాగాలు ఉంటాయి. దీన్ని 250 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మల్టిపుల్
ఛాయిస్ పద్ధతిలో ఉంటాయి. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో
ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2లో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ విభాగాలు ఉంటాయి. దీన్ని 200 మార్కులకు నిర్వహిస్తారు.
పరీక్ష తేది: 08.08.2021.
తెలుగు రాష్టాల్లో పరీక్షా
కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 15.04.2021.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది:
05.05.2021.
0 Komentar