వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం
కొత్త మార్గదర్శకాలు
దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో వైరస్‌ను తరిమికొట్టే బృహత్తర ప్రక్రియ వ్యాక్సిన్ పంపిణీని కేంద్రం మరింత వేగవంతం చేసింది. 18ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలు అందించే కార్యక్రమం మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీని సమర్థంగా అమలు చేయడం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం శనివారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ కోరారు. టీకా పంపిణీపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడు కొవిన్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
కేంద్రం మార్గదర్శకాలివే..
* ప్రయివేటు ఆసుపత్రులు,
ఇండస్ట్రీలకు చెందిన ఆసుపత్రులు తదితర వాటి సహకారంతో అదనపు
ప్రయివేటు కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను రిజిస్టర్ చేయాలి.
* ఏయే ఆసుపత్రులు ఎన్ని
వ్యాక్సిన్లను కొనుగోలు చేశాయి, టీకా నిల్వలు, వ్యాక్సిన్ ధరలను కొవిన్ యాప్‌లో ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
* కొవిన్‌లో వ్యాక్సిన్
స్లాట్‌లను అందుబాటులో ఉంచుతూ అర్హులై వారందరికీ టీకాలు వేయాలి.
* రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు నేరుగా వ్యాక్సిన్ల కొనుగోలు నిర్ణయానికి
ప్రాధాన్యమివ్వాలి.
* 18-45 ఏళ్ల వయసు గ్రూప్
వారికి కేవలం ‘ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే’ అన్న విషయాన్ని ప్రచారం చేయాలి.
* వ్యాక్సినేషన్, కొవిన్ యాప్ వినియోగంపై సిబ్బందికి ముందుగానే శిక్షణ ఇవ్వాలి.
* టీకా కేంద్రాల వద్ద రద్దీ
ఉండకుండా చూసే అధికారులకు పూర్తి సహకారం అందించాలి.
0 Komentar