విద్యా దీవెన మరోసారి వాయిదా
‘జగనన్న విద్యా దీవెన’ ద్వారా
బోధనా రుసుముల విడుదల కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. ఈ నెల 19వ తేదీన నిధుల
విడుదల ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. సంక్షేమ క్యాలెండర్
ప్రకారం తొలుత ఏప్రిల్ 9న బోధనారుసుములు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా
వాయిదా పడింది. ఏప్రిల్ 16న నిధులు విడుదల చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ
అధికారులు వెల్లడించినా ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు 19వ తేదీన విడుదల ఉంటుందని
చెప్పారు.
0 Komentar