TS: ఆధార్ ఉంటేనే ఇక
పోషకాహారం తప్పనిసరి చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ
అంగన్‌వాడీ పథకాలకు ఆధార్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. లబ్ధిదారులకు ఆధార్ సంఖ్య లేకుంటే ఇక నుంచి ఆరోగ్యలక్ష్మి కార్యక్రమ పరిధిలో సేవలే కాక పాలు, గుడ్లు, బాలా మృతం కూడా అందవు. ఈ మేరకు మహిళాశిశు సంక్షేమశాఖ కార్యదర్శి డి.దివ్య ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో 4.6 లక్షల మంది బాలింతలు, గర్బిణులకు ఆరోగ్యలక్ష్మితో పాటు చిన్నారులకు పోషకా హారం, ఆరోగ్య పరీక్షలు తదితరాలకు ప్రభుత్వం ఏటా దాదాపు రూ. 630 కోట్లు ఖర్చుచేస్తోంది.
ఈ నేపథ్యంలో పథకం పరిధిలోని లబ్దిదారులకు నగదు
బదిలీకి అనువుగా ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా తీసుకోవాలని, ధ్రువీకరణ
చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇప్పటికీ ఆధార్ లేని లబ్ధిదారులు
సంబంధిత కేంద్రంలో వివరాలు నమోదు చేసుకోవాలని కోరింది. ఆధార్ తీసుకున్నాక
ధ్రువీకరణ విఫలమైతే ప్రత్యామ్నాయాల్నీ పేర్కొంది. ఈ మేరకు. , వేలిముద్రలు సరిగా లేకుంటే ఐరిస్ స్కాన్, ముఖ
గుర్తింపు (ఫేస్ అథెంటికేషన్) ను అనుసరించి లబ్ది చేకూర్చుతారు. వేలిముద్రలు,
ఐరిస్, ముఖ ధ్రువీకరణలు విఫలమైతే ఓటీపీతో
సేవలు అందుతాయి. ధ్రువీకరణ పనిచేయకుంటే ఆధార్ నమోదు పత్రం లోని క్యూఆర్ కోడ్ సహాయం
తీసుకుంటారు.
0 Komentar