Why Do Ads Follow You Around the
Internet? - How to Manage them?
మీరు ఇంటర్నెట్ వాడేటప్పుడు ఏ ఏ యాడ్స్ ఎందుకు కనపడతాయి? - వాటిని ఎలా మేనేజ్ చెయ్యాలి?
మీరు గూగుల్‌కు చెందిన ఏదైనా సర్వీస్‌ను
ఉపయోగించినప్పుడల్లా గూగుల్ మీ డేటాను సేకరిస్తుంది. అయితే మీ డేటాను గూగుల్ ఏ
మేర సేకరించింది, మీకు చెందిన ఏయే వివరాలు గూగుల్ వద్ద
ఉన్నాయి? వంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు.
అందుకు గాను గూగుల్ క్రోమ్ బ్రౌజర్
ను ఓపెన్ చేసి అందులో గూగుల్ అకౌంట్‌లో లాగిన్ అవ్వాలి. తరువాత https://adssettings.google.com/
అనే సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో గూగుల్ మీ నుంచి సేకరించిన డేటా
వివరాలు ఉంటాయి.
గూగుల్ ఆ సైట్‌లో డిస్‌ప్లే చేసిన
సమాచారాన్ని మీ ద్వారా సేకరించిందన్నమాట. మీరు గూగుల్‌కు చెందిన ఏదైనా సర్వీస్‌ను
ఉపయోగించినప్పుడల్లా గూగుల్ మీ డేటాను సేకరిస్తుంది. అలా సేకరించిన డేటాను
పైన తెలిపిన సైట్‌లో చూపిస్తుంది. ఆ డేటాకు అనుగుణంగా మీకు గూగుల్ యాడ్స్ కనిపిస్తాయి.
అయితే ఆ డేటాను మీరు తొలగించవచ్చు.
అందుకు గాను అక్కడ చూపించే వాటిలో దేనిపైనైనా క్లిక్ చేసి అనంతరం వచ్చే ఆప్షన్లలో
రిమూవ్ అనే దాన్ని ఎంచుకోవాలి. దీంతో గూగుల్‌లో మీ డేటా డిలీట్ అవుతుంది. ఇలా ఎప్పటికప్పుడు
మీ నుంచి గూగుల్ సేకరించే డేటాను ఆ సైట్ నుంచి తొలగించవచ్చు.
0 Komentar