ఆధార్ లేకపోయినా టీకా వేయాలి – UIADI
ఆధార్ కార్డు లేదన్న సాకుతో
కొవిడ్-19 టీకాలు వేయడం నిరాకరించకూడదని భారత విశిష్ఠ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)
స్పష్టం చేసింది. ఆస్పత్రుల్లో చికిత్స, ఔషధాల విషయంలో ఆధార్
కార్డు తప్పనిసరి కాదని పేర్కొంది. ఆధార్ కార్డు లేని రోగులకు కొన్ని ఆస్పత్రులు
చికిత్స చేయడం లేదని, టీకాలు వేయడం లేదని వస్తున్న వార్తలపై
స్పందించింది. ‘‘ఆధార్ లేదని టీకా, ఔషధాలు, ఆస్పత్రుల్లో చికిత్స నిరాకరించకూడదు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
No vacene available at Visakhapatnam lost 1week (covaxin) if available please help me my due date 12-5-2021
ReplyDelete