AIIMS chief Randeep Guleria warns
against going for CT scan in mild Covid cases
సీటీ స్కాన్‌తో క్యాన్సర్ వచ్చే
అవకాశం – ఒక సీటీ స్కాన్ 400 చెస్ట్ ఎక్స్-రే ల తో సమానం – ఎయిమ్స్ డైరెక్టర్ రణ్
దీప్
కొవిడ్ పాజిటివ్ వచ్చిన వెంటనే
సీటీ స్కాన్ తీయించుకోవడం మంచిదికాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా
పేర్కొన్నారు. ఒక సీటీ స్కాన్ 400 చెస్ట్ ఎక్స్-రే లతో సమానమని, దానివల్ల
భవిష్యత్తులో కేన్సర్ ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరించారు. కరోనా లక్షణాలు
లేనివారు, తేలికపాటి లక్షణాలున్నవారు దాని జోలికి పోవద్దని
సూచించారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. "అసలు కరోనా
లక్షణాలు లేనివారు, తేలికపాటి లక్షణాలు ఉన్నవారు సీటీ
తీయించుకుంటే లోపల మరకలు (ప్యాచెస్) వస్తాయి. అవి ఎలాంటి చికిత్స లేకుండానే వాటంతట
అవే పోతాయి. ఆక్సిజన్ స్థాయి సాధారణంగానే ఉండి, తేలికపాటి
లక్షణాలతో ఇంట్లోనే ఏకాంతంలో కొనసాగుతున్నవారు సీటీ చేయించుకోవాల్సిన అవసరమేలేదు.
యువత ఎక్కువ సీటీ స్కాన్ చేయించుకుంటే తర్వాతి దశలో కేన్సర్ ముప్పు పెరిగే ప్రమాదం
ఉంది.
ఛాతీకి ఎక్స్ రే
మధ్యస్థాయి లక్షణాలతో ఆసుపత్రుల్లో
చేరేటప్పుడు మాత్రమే సీటీ స్కాన్ చేయించుకోవాలి. ఏదైనా అనుమానం ఉంటే తొలుత ఛాతీకి
ఎక్స్ రే తీయించుకున్న తర్వాతే సీటీస్కాన్‌కు వెళ్లాలి. బయో మార్కర్స్ రక్త
పరీక్షల జోలికి కూడా పోవద్దు. కొందరు ప్రతి మూడు రోజులకు ఒకసారి స్కాన్
చేయించుకుంటున్నారు. అలాంటి వారికి భవిష్యత్తులో కేన్సర్ ముప్పు అధికం. తేలికపాటి
లక్షణాలు ఉన్నవారికి చాలా వరకు ఎలాంటి మందులు అవసరం లేదు. ఒకవేళ తీసుకోవాల్సి
వస్తే ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ తీసుకోవచ్చు.
అంతకుమించి అవసరం లేదు. ఆసుపత్రుల్లో కొందరు రోగులు ప్రాథమిక దశల్లోనే
స్టిరాయిడ్స్ తీసుకుంటున్నారు. అలా చేస్తే వైరసకు బలం చేకూరుతుంది. అధికమందుల
వినియోగం (ఓవర్ ట్రీట్ మెంట్) వల్ల నష్టం కలుగుతుంది.
ఆక్సిజన్ థెరపీ
ఇళ్లలో ఉన్న వారికి ఆక్సిజన్ స్థాయి 93 కంటే తక్కువకు పడిపోయినా, అనారోగ్యం పెరిగినట్లు కనిపించినా, ఛాతీలో నొప్పిగా అనిపించినా డాక్టర్ ని సంప్రదించి అవసరమైతే ఆసుపత్రిలో చేరాలి. అన్నింటికంటే ముందు చేయాల్సింది ఆక్సిజన్ థెరఫీ. ఆక్సిజన్ పడిపోతున్నప్పుడు స్టిరాయిడ్స్ అవసరం వస్తుంది. ఆ తర్వాత రక్తం గడ్డకట్టకుండా యాంటీ కాగులెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల రక్తం పలుచబడి గడ్డకట్టకుండా ఉంటుంది. ఇవి తేలికపాటి లక్షణాలున్నవారికి ఇవ్వకూడదు. అత్యవసర పరిస్థితుల్లో, రోగి పరిస్థితి దిగజారుతున్నప్పుడే రెమ్ డెసివిర్, టొసిజొలిమాబ్, కన్వాల సెంట్ ప్లాస్మాలు ఇస్తారు. దీనివల్ల ఫలితాలేమీ రావు. దీనికంటే ఆక్సిజన్, స్టిరాయిడ్స్, యాంటీ కాగులెంట్స్ వల్లే ప్రయోజనం ఉంటుంది. ఇవి మూడూ అందుతుంటే చికిత్స సరైన కోణంలో సాగుతున్నట్లే లెక్క" అని గులేరియా వివరించారు.
0 Komentar