Amazing Health Benefits of Palmyra Fruits
తాటి ముంజలు ఎందుకంత ప్రత్యేకం – అవి ఎంత మేలు చేస్తాయో తెలుసుకోండి
వేసవికాలం వచ్చిందంటే మామిడి, పుచ్చకాయ,
జామ, ఖర్బూజా ఇలా అనేక రకాల పండ్లు
నోరూరిస్తుంటాయి. అయితే చాలామంది వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు పుచ్చకాయ,
ఖర్బూజా తినడానికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే వేసవిలో అత్యంత చలువ
చేసేది, ఈ కాలంలో మాత్రమే దొరికేది ఒకటుంది. అవే తాటి
ముంజలు. గ్రామాల్లో తాటిచెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ముంజలు విరివిగా
దొరుకుతుంటాయి. అదే నగరాల్లో అయితే అవి దొరకడమే గగనం. అందుకే వాటి విలువ తెలిసిన
వారు ధర ఎంతైనా సరే కొనడం మాత్రం మానుకోరు.
తాటి ముంజలు ఎందుకంత ప్రత్యేకం
1. మీ శరీరాన్ని శుభ్ర
పరుస్తుంది
తాటి ముంజల్లో విటమిన్ ఎ, బి,
సి, ఐరన్, జింక్,
పాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలుంటాయి.
ఇవి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపుతాయి. దీంతో శరీరం శుభ్రమవుతుంది.
2. బరువు తగ్గుతారు
ముంజల్లో నీటిశాతం ఎక్కువగా ఉండటం
వల్ల కొద్దిగా తిన్నా పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు.
ఇవి బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం.
3. జీర్ణక్రియ మెరుగు
తాటి ముంజలకు శరీరాన్ని చల్లబరిచే
గుణం ఉండటంతో వేసవిలో ఎంతో మేలు చేస్తాయి. ఎండ వల్ల కలిగే అలసట, నీరసాన్ని
దూరం చేస్తుంది. మలబద్దకం సమస్యను నివారించడంలో ముంజలు బాగా పనిచేస్తాయి. వీటిని
తరుచూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి అజీర్తి, ఎసిడిటీ
సమస్యలు దూరం అవుతాయి.
4. మొటిమలను తగ్గించడంలోనూ
ముంజలు బాగా పనిచేస్తాయి.
5. గర్భిణులకు ఇవి ఎంతో
మేలు చేస్తాయి.
మనకు ఇంత మేలు చేసే తాటి ముంజలను ఈ
వేసవిలో తినడం మిస్ కాకండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల
ప్రకారం ఈ వివరాలను అందించాం.
0 Komentar