బీసీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగింపు – ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ఉద్యోగ
సర్వీసుల్లో వెనుకబడిన తరగతులకు అమలవుతున్న రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం మరో
పదేళ్ల పాటు పొడిగించింది. ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య
కార్యదర్శి జి. అనంతరాము బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మంత్రివర్గ
సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జీవోను విడుదల చేశారు.
బీసీల్లోని ఎ,బి,సి,డి,ఇ గ్రూపుల్లోని అందరికీ
రిజర్వేషన్ల పొడిగింపు వర్తిస్తుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి 2031
మే 31 వరకు రిజర్వేషన్ల పొడిగింపు ఉత్తర్వులు
అమల్లో ఉంటాయి. ఉద్యోగ నియామకాల్లో గరిష్ట పరిమితిలో అయిదేళ్ల సడలింపుతో పాటు
నిబంధనలకు అనుగుణంగా మరో పదేళ్ల పాటు ఇతర రిజర్వేషన్ల సదుపాయాలన్నీ వెనుకబడిన
తరగతులకు లభించనున్నాయి.
BACKWARD CLASSES WELFARE DEAPRTEMNT -
List of Socially and Educationally Backward Classes – Concessions in regard to
reservations in Services and Educational Institutions – Extension for a further
period of 10 years – Orders – Issued.
G.O.MS.No. 3 Dated: 19-05-2021
0 Komentar