AP: బ్లాక్‌ఫంగస్‌ను
ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
కరోనా నుంచి కోలుకున్న అనంతరం కొందరిలో బయటపడుతున్న బ్లాక్ ఫంగస్ కేసులకు చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. కరోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే బ్లాక్ ఫంగస్‌కు చికిత్సచేయాలన్నారు. అలాగే, బ్లాక్ ఫంగస్ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు సింఘాల్ ఆదేశాలు జారీచేశారు.
మరోవైపు, విశాఖ
జిల్లాలో బ్లాక్ ఫంగస్ రోగుల చికిత్సకు కేజీహెచ్‌లో పడకలు ఏర్పాటు చేశారు.
డెర్మటాలజీ విభాగంలో 20 పడకలను కేటాయించినట్టు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ
ఆదేశాలతో క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రొటోకాల్ కమిటీని ఆంధ్రా మెడికల్ కళాశాల
ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
HM & FW Dept. – Inclusion of
procedure “Post COVID with Mucor Mycosis Management” under
Dr YSR Aarogyasri Scheme – Orders - Issued.
HEALTH, MEDICAL & FAMILY WELFARE (I)
DEPARTMENT
G.O.MS.No. 54
Dated: 19-05-2021
0 Komentar