AP Covid-19 Media Bulletin 04-05-2021
ఏపీలో 20,034 కొత్త కరోనా కేసులు
ఏపీలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కొత్తగా మరో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 1,15,784 శాంపిల్స్ పరీక్షించగా, రాష్ట్ర వ్యాప్తంగా 20,034 మందికి పాజిటివ్‌గా (17.3% పాజిటివిటీ) నిర్ధారణ అయ్యాయి అలాగే, 82 మంది మృతి చెందారు. వైరస్ బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు.
గడిచిన 24గంటల్లో శ్రీకాకుళం
జిల్లాలో అత్యధికంగా 2398 కొత్త కేసులు రాగా.. అత్యల్పంగా కడప జిల్లాలో 793 కేసులు
నమోదయ్యాయి. ఇక మరణాలను పరిశీలిస్తే, పశ్చిమగోదావరి జిల్లాలో 12మంది కొవిడ్‌తో
ప్రాణాలు కోల్పోగా, అనంతపురం జిల్లాలో 9మంది, తూర్పుగోదావరి 9, విశాఖ 9, విజయనగరం
9, నెల్లూరు 7, కృష్ణా 6, గుంటూరు 5, చిత్తూరు 4, కర్నూలు
4, ప్రకాశం 4, శ్రీకాకుళం జిల్లాలో
నలుగురు చొప్పున మృత్యువాతపడ్డారు. తాజాగా 12,207మంది కోలుకొని డిశ్చార్జి
అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,59,597 క్రియాశీల కేసులు ఉన్నాయి.
0 Komentar