AP Covid-19 Media Bulletin 05-05-2021
ఏపీలో 22,204 కొత్త కరోనా కేసులు
ఏపీలో కరోనా ఉగ్రరూపం
కొనసాగుతోంది. కొత్తగా మరో 22 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24గంటల వ్యవధిలో 1,16,367
శాంపిల్స్ పరీక్షించగా, రాష్ట్ర వ్యాప్తంగా 22,204 మందికి పాజిటివ్‌గా (19%
పాజిటివిటీ) నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా
పెరుగుతోంది.
గడిచిన 24గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2,344మంది కరోనా బారిన పడ్డారు. అత్యల్పంగా కడప జిల్లాలో 903 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలను పరిశీలిస్తే, విశాఖపట్నం, విజయనగరంలలో 11మంది చొప్పున ప్రాణాలు కోల్పోగా.. అనంతపురంలో 10, తూర్పుగోదావరి 9, ప్రకాశం 8, పశ్చిమగోదావరి 7, చిత్తూరు 6, గుంటూరు 5, కర్నూలు 5, నెల్లూరు 5, కృష్ణా 4, శ్రీకాకుళం 3, కడపలో ఒకరు మృతి చెందారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,69,50,299 శాంపిల్స్ పరీక్షించ,గా, 12,06,232మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 10,27,270మంది
కోలుకొని డిశ్చార్జి కాగా, 8374మంది
ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,70,588
క్రియాశీల కేసులు ఉన్నాయి.
0 Komentar