AP
Covid-19 Media Bulletin 27-05-2021
ఏపీలో
కొత్తగా 16,167 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
కొత్తగా 16వేలకు పైగా కరోనా పాజిటివ్
కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 84,224 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 16,167మందికి
పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 16,43,557కు చేరింది. మరోవైపు 21,385మంది కరోనా నుంచి
కోలుకోగా, మొత్తం 14,46,244 మంది కరోనా
నుంచి బయటపడ్డారు.
తాజాగా
కరోనాతో పోరాడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స 104మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14మంది
మృతి చెందగా, పశ్చిమగోదావరి 13, విశాఖపట్నం
11, అనంతపురం 9, నెల్లూరు 9, గుంటూరు 8, విజయనగరం 8, ప్రకాశం
7, తూర్పుగోదావరి 6, కృష్ణా 6, కర్నూలు 6, శ్రీకాకుళం 6, కడపలో
ఒకరు కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య 10,531కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,86,728 యాక్టివ్ కేసులున్నాయి.
0 Komentar