AP
Covid-19 Media Bulletin 30-05-2021
ఏపీలో
కొత్తగా 13,400 కరోనా కేసులు
ఏపీలో
కరోనా వైరస్ కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 84,232 కొవిడ్ పరీక్షలు
నిర్వహించగా, 13,400 పాజిటివ్ కేసులు
నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరో 94 మంది ప్రాణాలు
కోల్పోగా.. 21,133 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు.
కొవిడ్
వల్ల చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది, ప్రకాశంలో తొమ్మిది, పశ్చిమ
గోదావరిలో తొమ్మిది, అనంతపురంలో ఎనిమిది, తూర్పు గోదావరిలో ఎనిమిది, శ్రీకాకుళంలో ఎనిమిది,
విశాఖపట్నంలో ఎనిమిది, కృష్ణాలో ఆరుగురు,
విజయనగరంలో ఆరుగురు, కర్నూల్లో ఐదుగురు,
నెల్లూరులో ఐదుగురు, గుంటూరులో నలుగురు,
కడప జిల్లాలో నలుగురు మృతిచెందారు.
రాష్ట్ర
వ్యాప్తంగా ఇప్పటివరకు 1,91,72,843
శాంపిల్స్ పరీక్షించగా, 16,82,247
మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 15,05,620 మంది
కోలుకొని డిశ్చార్జి కాగా.. 10,832మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,65,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
0 Komentar