ఏపీలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగింపు
ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి
దృష్ట్యా కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూను
పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష అనంతరం
కర్ఫ్యూ పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి 10
రోజులే అయిందన్న సీఎం.. కర్ఫ్యూ 4 వారాలు ఉంటేనే సరైన ఫలితాలు
వస్తాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు
తీసుకుంటున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న కర్ఫ్యూ నిబంధనలే నెలాఖరు వరకు కొనసాగుతాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. కొవిడ్ బాధితుల్లో కొందరిని వేధిస్తున్న బ్లాక్‌ఫంగస్ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించినట్లు మంత్రి వివరించారు. బ్లాక్ ఫంగస్ నివారణ మందులు సమకూర్చాలని సీఎం ఆదేశించారన్నారు. 10 వేల ఆక్సిజన్ కాన్స్‌న్‌ట్రేటర్లకు టెండర్లు పిలిచామని వివరించారు. ఈ నెలాఖరుకు 2 వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులోకి వస్తాయని ఆళ్లనాని అన్నారు. ఫీవర్ సర్వేలో భాగంగా కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి.. లక్షణాల తీవ్రతను బట్టి చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు.
కరోనా ఉద్ధృతితో ఈనెల 5న
ఏపీలో అమల్లోకి తీసుకొచ్చిన కర్ఫ్యూ 18వ తేదీ వరకు
ఉంటుందని ప్రభుత్వం నాలుగో తేదీ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే కొవిడ్
కేసులు తగ్గకపోవడంతో పగటి కర్ఫ్యూని పొడిగించారు. ప్రస్తుతం రోజూ
మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటున్నాయి. ఉదయం 6 గంటల
నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు,
రెస్టారెంట్లను అనుమతిస్తున్నారు. ఆ సమయంలోనూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
కొవిడ్‌తో అనాథలైన పిల్లలను
ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు CM స్పష్టం చేశారు. వారికి ఆర్థికసాయం అందజేయడంపై కార్యాచరణకు
అధికారులను ఆదేశించామన్నారు.
HM& FW Department – Imposing of
Curfew from 12 Noon to 6 AM with effect from 05.05.2021 for a period of two
weeks (05.05.2021 TO 18.05.2021) in the State to contain the spread of Covid-19
- Extension of curfew up to 31.05.2021- Orders – Issued.
G.O.RT.No. 240 Dated: 17-05-2021.
0 Komentar