ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా
ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా
వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. పరీక్షల నిర్వహణపై
పునరాలోచన చేయాల్సిందిగా హైకోర్టు సూచించడాన్ని పరిగణలోకి తీసుకొని ఈ మేరకు
నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలు
వాయిదా వేస్తున్నామన్నారు. కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత పరీక్షల కొత్త తేదీలను
ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు.
దేశంలో, రాష్ట్రంలో
పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఇందుకు సంబంధించిన వార్తలు
చూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన
చెందుతున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజా ప్రభుత్వంగా పరిగణనలోకి తీసుకుని పరీక్షలు
వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.
Good Decision
ReplyDelete