Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: మే 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ – రెండు వారాల పాటు ఆంక్షలు!

 

AP: మే 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ రెండు వారాల పాటు ఆంక్షలు!

 

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులకు అనుమతి

12 గంటల తర్వాత 144వ సెక్షన్‌ అమలు

కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంపై కొవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గించడం, బెడ్‌ల కొరత నివారించేందుకు అవసరమైన చర్యలపై సీఎం చర్చించినట్టు తెలుస్తోంది. చర్చల అనంతరం సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. 

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఎల్లుండి (బుధవారం) నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇవ్వనున్నారు. 12 గంటల తర్వాత అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఆ సమయంలో 144వ సెక్షన్‌ అమలులో ఉండనుంది. ఈ ఆంక్షలను రెండు వారాల పాటు అమలు చేయనున్నారు. ఏపీలో ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ అమలులో ఉన్న విషయం తెలిసిందే.

Previous
Next Post »
0 Komentar

Google Tags