రాష్ట్రంలోని పాఠశాలలు, అంగన్‌వాడీల్లో
నాడు-నేడుపై సిఎం సమీక్ష
పిల్లలకు 2కి.మీల దూరం లోపలే బడి
పాఠశాల విద్యాశాఖలో తీసుకొస్తున్న
సంస్కరణల వల్ల రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడకూడదని ఏపీ సీఎం జగన్‌మోహన్
రెడ్డి ఆదేశించారు. విద్యా వ్యవస్థ మరింత ప్రభావవంతంగా మారేలా కార్యాచరణను అమలు
చేయాలని అధికారులకు సూచించారు. స్కూళ్ల నిర్వహణ, టీచర్ల వినియోగంలో
జాతీయ ప్రమాణాలు పాటించాలన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, అంగన్‌వాడీల్లో
నాడు-నేడుపై ఆయన సమీక్షించారు.
* పిల్లల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు
ఉండాలన్నారు.
* విద్యార్థులు తక్కువ,
టీచర్లు ఎక్కువ ఉన్న పాఠశాలల్లో అంగన్‌వాడీ పిల్లలను కలుపుకొనేలా చేస్తామని
అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
* అవకాశం ఉన్నచోట మూడో తరగతి నుంచి
ఐదో తరగతి వరకు ఉన్నత పాఠశాల పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు.
* అధికారుల ప్రతిపాదనలు పరిశీలించిన
సీఎం, రాష్ట్రంలో ప్రతి పాఠశాల వినియోగంలో ఉండాలన్నారు.
* అవసరమైనచోట అదనపు గదులు
నిర్మించాలని సీఎం ఆదేశించారు.
* పిల్లలకు 2కి.మీల
దూరం లోపలే బడి ఉండాలన్నారు.
* పాఠశాలల నిర్వహణలో జాతీయ
ప్రమాణాలను పాటించాలని సూచించారు.
* ప్రభుత్వం తీసుకొస్తున్న
మార్పుల్లో టీచర్ల పాత్ర కీలకమని, వారిని ఆప్యాయతతో దగ్గరకు తీసుకొని
మంచిపనితీరు రాబట్టుకోవాలన్నారు.
* అంగన్‌వాడీ ఉపాధ్యాయుల కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ
రూపొందించిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం, సీడీలను సీఎం
ఆవిష్కరించారు.
0 Komentar