నేటి నుంచి జూనియర్ కాలేజీలకు
సెలవులు
రాష్ట్రంలోని అన్ని జూనియర్
కాలేజీలకు ఇంటర్ బోర్డు సోమవారం నుంచి సెలవులు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు
కార్యదర్శి వి.రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ
నిర్ణయానుసారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ఈనెల
5 నుంచి జరగాల్సిన ఇంటర్ పబ్లిక్
పరీక్షలు (థియరీ) వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలు తిరిగి ఎప్పుడు
నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షల కొత్త షెడ్యూల్‌ను 15 రోజుల
ముందుగా విద్యార్థులకు తెలియచేస్తామని చెప్పారు. పరీక్షల తేదీలను ప్రకటించిన
అనంతరం బోధన, బోధనేతర
సిబ్బంది అందరూ కళాశాలలకు హాజరు కావాలని సూచించారు.
0 Komentar