ఏపీలో 17,188 కొత్త కరోనా కేసులు
తెలంగాణలో 5,559 కొత్త కరోనా కేసులు
ANDHRA PRADESH:
గత 24 గంటల్లో 1,00,424 కరోనా పరీక్షలు చేయగా, 17,188 మంది పాజిటివ్‌గా
నిర్ధారణ. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 12,45,374 మంది వైరస్ బారినపడగా, మొత్తం 1,71,60,870 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. కొవిడ్‌తో బాధపడుతూ గత 24 గంటల్లో విజయనగరంలో 11మంది మృతి చెందగా, విశాఖ 10, తూర్పుగోదావరి 8, చిత్తూరు
7, కృష్ణా 6, గుంటూరు 6, కర్నూలు 5, ప్రకాశం 5, పశ్చిమగోదావరి
5, నెల్లూరు 4, శ్రీకాకుళం 4, అనంతపురంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.
తాజాగా 12,749మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 10,50,160మంది కరోనా నుంచి బయటపడ్డారు. గడిచిన 24 గంటల్లో
అత్యధికంగా చిత్తూరు 2,260 పాజిటివ్ కేసులు నమోదు కాగా,
అత్యల్పంగా ప్రకాశం 385 మంది కరోనా బారిన
పడ్డారు.
TELGANGANA: (ఇకపై ప్రతిరోజు
సాయంత్రం బులెటిన్ విడుదల)
తెలంగాణ కరోనా బులెటిన్‌ను ఇకపై
ప్రతి రోజూ సాయంత్రం విడుదల చేయనున్నట్లు ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్
తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల మధ్య రాష్ట్ర
వ్యాప్తంగా 65,375 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు డీహెచ్
తెలిపారు. వాటిలో 5,559 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. 41 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం
కేసుల సంఖ్య 4,87,199కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,061 మంది కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,13,225కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 71,308 యాక్టివ్
కేసులు ఉన్నాయి.
0 Komentar