AP & TS Covid-19 Media Bulletins 08-05-2021
ఏపీలో 20,065 కొత్త కరోనా కేసులు
తెలంగాణలో 5,186 కొత్త కరోనా కేసులు
ANDHRA PRADESH:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్
విజృంభణ కొనసాగుతోంది. వరుసగా నాలుగు రోజుల పాటు 20వేలకు పైగా
పాజిటివ్ కేసులు నమోదు కాగా, శుక్రవారం కాస్త తగ్గినట్లు
కనిపించింది. అయితే, గత 24 గంటల్లో
మళ్లీ 20వేల మందికి పైగా కరోనా బారిన పడినట్లు వైద్య
ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. మొత్తం 1,10,571 శాంపిల్స్ పరీక్షించగా, 20,065మంది కరోనా పాజిటివ్‌గా
నిర్థారణ అయింది. పాజిటివిటీ రేటు 19.75శాతం ఉండగా, అత్యధికంగా 96మంది మృతి చెందినట్లు వెల్లడించారు.
చిత్తూరులో అత్యధికంగా 2,269 కరోనా బారిన పడ్డారని,
ఆ తర్వాత తూర్పుగోదావరి 2,370,
విశాఖ 2525లలో అత్యధిక కేసులు నమోదైనట్లు
వివరించారు. ఇక గత 24 గంటల్లో పశ్చిమగోదావరిలో 14మంది చనిపోగా, విశాఖలో 12మంది
మృత్యువాతపడ్డారు.
TELGANGANA:
తెలంగాణలో కరోనా వ్యాప్తి
కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ తక్కువ కేసులు నమోదయ్యాయి. గడిచిన
24 గంటల్లో 69,148 నమూనాలను పరీక్షించగా,
5,186 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి
సంఖ్య 4,92,385కి చేరింది. తాజాగా 38 మహమ్మారి కారణంగా 38 మంది ప్రాణాలు
కోల్పోగా.. మృతుల సంఖ్య 2,704కి పెరిగింది. ఇవాళ 7,994 మంది వైరస్ నుంచి
కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 68,462
క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 904 మందికి
పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
0 Komentar