AP & TS Covid-19 Media Bulletins 09-05-2021
ఏపీలో 22,164 కొత్త కరోనా కేసులు
తెలంగాణలో 4,976 కొత్త కరోనా కేసులు
ANDHRA PRADESH:
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది.
రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు దాటేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,05,494 నమూనాలను పరీక్షించగా, 22,164 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కరోనా
మహమ్మారి కారణంగా తాజాగా 92 మంది ప్రాణాలు కోల్పోయినట్లు
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ మీడియాకు
వెల్లడించారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,87,603 కేసులు
నమోదవ్వగా, మరణాలు 8,707కి
పెరిగాయి. తాజాగా 8,832 మంది వైరస్ నుంచి కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం
1,90,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రెండో డోసు వాక్సినేషన్‌కు మాత్రమే
సరిపడా వ్యాక్సిన్ ప్రస్తుతం అందుబాటులో ఉందని అన్నారు. మొదటి డోసు టీకా ఎప్పటి
నుంచి ఇస్తామన్న విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామన్నారు.
TELGANGANA:
తెలంగాణలో కరోనా వ్యాప్తి
కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 55,358
నమూనాలను పరీక్షించగా 4976 మందికి పాజిటివ్ నిర్ధారణ
అయ్యింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,97,361కి
చేరింది. కరోనా మహమ్మారితో తాజాగా 35 మంది ప్రాణాలు
కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 2,739కి పెరిగింది.
రాష్ట్రంలో 7,646 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర
ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 851 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరిలో 384, మహబూబ్‌నగర్‌లో 208 కేసులు నమోదైనట్లు పేర్కొంది.
0 Komentar