AP & TS Covid-19 Media Bulletins 10-05-2021
ఏపీలో 14,986 కొత్త కరోనా కేసులు
తెలంగాణలో 4,826 కొత్త కరోనా కేసులు
ANDHRA PRADESH:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 14వేల మంది కరోనా బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 60,124 శాంపిల్స్ పరీక్షించగా, 14,986 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనాతో బాధపడుతూ 84మంది మృతి చెందారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 2,352 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరిలో 423మంది కరోనా బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లో 16,167మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,74,28,059 శాంపిల్స్‌ను పరీక్షించారు.
ప్రస్తుతం
రాష్ట్రంలో 1,89,367 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ వల్ల పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో 12మంది చొప్పున
చనిపోగా, తూర్పుగోదావరి 10, విశాఖ 9,
నెల్లూరు 8, విజయనగరం 8, చిత్తూరు 6, కర్నూలు 6, కృష్ణా
4, శ్రీకాకుళం 4, అనంతపురం 3, కడపలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి
చనిపోయిన వారి సంఖ్య 8,791కు చేరింది.
TELGANGANA:
తెలంగాణలో కరోనా వ్యాప్తి
కొనసాగుతోంది. తెలంగాణలో కరోనా వ్యాప్తి నెమ్మదించింది. 24 గంటల వ్యవధిలో 4,826 పాజిటివ్
కేసులు, 32 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో
మొత్తం కరోనా కేసులు 5,02,187కి చేరాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,36,619 మంది
కోలుకుని డిశ్చార్జి కాగా.. 62,797 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఒక్క రోజు వ్యవధిలో 65,923 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. కరోనాతో ఇప్పటి
వరకు 2,771 మంది మృతి చెందారు.
0 Komentar