ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్లకు
కరోనా టీకా: విద్యా శాఖ మంత్రి
ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే ఇన్విజిలేటర్‌లందరికీ కరోనా టీకా వేసేందుకు చర్యలు ప్రారంభించామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28వేల మందికి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే కొందరు టీకా తీసుకున్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, మాస్క్‌లు
ఏర్పాటు చేసేందుకు జిల్లా వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రతి పరీక్షా
కేంద్రంలో ఒక ఐసోలేషన్ గదిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ప్రతిచోట ఐదు పీపీఈ
కిట్లు అందుబాటులో ఉంచాలి. మనం చేసే ఏర్పాట్లతో పిల్లల ఆరోగ్య భద్రతపై
తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడాలి. పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అవసరమైన రవాణా
సౌకర్యం కల్పించడంతోపాటు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి. పరీక్షల నిర్వహణలో
అధికారులంతా ఎవరి వంతు వారు బాధ్యతగా పని చేయాలి’’ అని సూచించారు.
0 Komentar