Bank of Baroda Released Important
Banking Numbers - Check Balance on WhatsApp Also
బ్యాంక్ ఆఫ్ బరోడా: మిస్డ్ కాల్ తో బ్యాంక్ బ్యాలెన్స్
తెలుసుకోండిలా - వాట్సాప్‌లో పలు రకాల సేవలు
బ్యాంక్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవాలని యోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీరు ఎక్కడికీ వెళ్లకుండానే బ్యాంక్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో సులభంగానే తెలుసుకోవచ్చు. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు.
మీ బ్యాంక్ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో మీకు తెలిసిపోతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా ఈ వివరాలను ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. 8468001111 అనే నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. మీ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉంతో తెలిసిపోతుంది.
అంతేకాకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియా వాట్సాప్ ద్వారా కూడా పలు రకాల సర్వీసులు అందిస్తోంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మిని స్టేట్‌మెంట్, చెక్ బుక్ రిక్వెస్ట్, చెక్ స్టేటస్, డెబిట్ కార్డు బ్లాక్, బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, ఇతర సర్వీసులను వాట్సాప్ ద్వారానే పొందొచ్చు. దీని కోసం మీరు 8433888777 నెంబర్‌కు మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంకా పలు
నెంబర్లను అందుబాటులో ఉంచింది. 8468001122 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే
చివరి ఐదు లావాదేవీల వివరాలు లభిస్తాయి. బ్యాంక్ ఇంకా రెండు టోల్ ఫ్రీ నెంబర్లను
కూడా ఇచ్చింది. 18002584455, 18001024455 నెంబర్లకు కాల్
చేసి బ్యాంక్ సేవలు పొందొచ్చు.
To maintain social distancing, you can continue your banking services from your home. #BankofBaroda is here by your side 24x7, with these simple and easy ways. #BankfFromHome #BreakTheChain #StaySafeBankSafe pic.twitter.com/MiXNKaCSc8
— Bank of Baroda (@bankofbaroda) May 10, 2021
0 Komentar