Bank of Baroda's New Cheque Payment Rule
from June – Details Here
చెక్ చెల్లింపులు చేసే BoB ఖాతాదారులకు కొత్త రూల్
మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారుడా.. చెక్ చెల్లింపుల్లో జరిగే మోసాలను నివారించేందుకు, "పాజిటీవ్ పే కన్ఫర్మేషన్" ను తప్పనిసరి చేసింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ కొత్త చెల్లింపుల వ్యవస్థను వచ్చే నెల నుంచి అంటే జూన్, 2021ని అమలు చేయనుంది. ప్రాసెస్ చేయవలసిన చెక్ విలువ రూ. 2 లక్షలు, అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు చెక్ వివరాలను తప్పనిసరిగా పునః నిర్థారణ చేయాలని తన ఖాతాదారులకు తెలిపింది.
బ్యాంక్ ఖాతాదారులు, లబ్ధిదారులకు జారీ చేసిన చెక్కుల గురించి బ్యాంకుకు ముందస్తు సమాచారాం ఇవ్వాలి. తద్వారా సీటీఎస్ క్లియరింగ్‌లో కస్టమర్లకు సంప్రదించకుండా అధిక విలువ గల చెక్కులను బ్యాంక్ పాస్ చేస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా.. చెక్
చెల్లింపులకు వర్తించే నియమాలు..
* రూ. 50వేలు అంతకంటే ఎక్కువ మొత్తంతో జారీ చేసే చెక్కులను నిర్ధారించుకోవచ్చు.
* మోడ్ ద్వారా ఒకసారి కన్ఫర్మేషన్
రిజిస్టర్ చేస్తే.. దాన్ని సవరించేందుకు గానీ, తొలగించేందుకు
గానీ వీలులేదు. కారణం.. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సర్వర్‌కు ఒకసారి
డేటా సమర్పించిన తరువాత.. దాన్ని తిరిగి సవరించేందుకు గానీ తొలగించేందుకు
గానీ అవకాశం లేదు. అయితే, బ్యాంకు కస్టమర్లు జారీ చేసిన చెక్కులు.. పేమెంట్ చేయకముందు, సీటీఎస్ క్లియరింగ్ లేదా కౌంటర్ వద్ద ఏ సమయంలోనైనా ఆపవచ్చు.
* ఖాతాలో తగినన్ని నిధులు
ఉండడం, చెక్‌పై సంతకం మొదలైనవి సరిపోలడంతో పాటు
సీటీఎస్‌కి అందించిన వివరాలు, వాస్తవ చెక్ వివరాలతో సరిపోలితే
చెక్ పాస్ చేస్తారు.
* ఏదైనా ఛానల్ / మోడ్
ద్వారా ప్రతీరోజు సాయంత్రం 6 గంటల వరకు సమర్పించిన /
ధృవీకరించబడిన వివరాలు తదుపరి క్లియరింగ్ సెషన్‌లో మాత్రమే ప్రాసెస్ చేస్తారు. 6 గంటల తరువాత నిర్ధారించిన వివరాలు ఆ మరుసటి సెక్షన్‌లో ప్రాసెస్
చేస్తారు. బ్యాంకు బ్రాంచికి వెళ్లి నిర్ధారించే వారు ఆ బ్యాంకు బ్యాంచ్‌లు పనిచేసే
వేళలను అనుసరించి రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇతర అన్ని మోడ్‌లు/ఛానల్లు 24x7 అందుబాటులో ఉంటాయి.
* విజయవంతంగా సమర్పించిన
ప్రతీ 'పాజిటివ్ పే కన్ఫర్మేషన్' కు
సంబంధించిన రిఫరెన్స్ నెంబరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు
ఎస్ఎమ్ఎస్ ద్వారా వస్తుంది.
* చెక్ ధృవీకరించినా.. లేకపోయినా,
కస్టమర్లు చెక్ జారీ చేసే ముందు ఖాతాలో తగిన నిధులు ఉండేలా
చూసుకోవాలి.
* మొబైల్ బ్యాంకింగ్,
నెట్ బ్యాంకింగ్, బ్రాంచ్‌ని సందర్శించడం,
ఎస్ఎమ్ఎస్, కాల్ సెంటర్... ఇందులో ఏదో ఒక
విధానం ద్వారా కన్ఫర్మేషన్‌కు వివరాలు పంపవచ్చు.
* కన్మర్మేషన్ కోసం వివరాలు పంపి మూడు నెలలు దాటిన చెక్కులను అనుమతించరు.
'పాజిటివ్ పే సిస్టమ్'
అంటే ఏమిటి?
చెక్కులోని వివరాలను మరోసారి ధృవీరకరించుకోవడమే "పాజిటీవ్ పే"వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యం. ఈ ప్రక్రియలో అధిక విలువతో కూడిన చెక్కును జారీ చేసినప్పుడు, చెక్కులో పేర్కొన్న తేది, లబ్ధిదారుని పేరు, చెక్ జారీ చేసిన వారి పేరు, అమౌంట్ తదితర వివరాలు పాజిటీవ్ పే వ్యవస్థ ద్వారా పునః నిర్ధారణ చేస్తారు.
చెక్ జారీ చేసే వారు, ఎస్ఎమ్ఎస్,
మొబైల్ అనువర్తనం, ఇంటర్నెట్ బ్యాంకింగ్,
ఎటిఎం మొదలైన ఛానెళ్ల ద్వారా ఎలక్ట్రానిక్‌గా చెక్‌లోని కనీస వివరాలను
బ్యాంకుకు తెలియజేయాలి. ఈ వివరాలను
సీటీఎస్ వద్ద సమర్పించిన చెక్కుతో క్రాస్ చెక్ చేస్తారు. ఏదైనా వ్యత్యాసం
ఉంటే అటువంటి చెక్‌లను బ్యాంక్ నిలిపివేస్తుంది.
0 Komentar