Benefits of Good Sleep - Tips for Better
Sleep
మంచి నిద్ర వలన ప్రయోజనాలు - మంచి నిద్రకు చిట్కాలు
నిద్ర అనేది శరీరానికి సంబంధించిన
విశ్రాంతి స్థితి. మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరం. శారీరకపరంగా అత్యంత
ముఖ్యమైనది. పూర్వ కాలంలో మనుషులు రోజంతా కష్టం చేసి ఇంటికి వచ్చినవారు సాయంత్రం 7
గంటల కల్లా భోజనం చేసి 8 గంటలకల్లా నిద్రకు ఉపక్రమించేవారు.
మళ్లీ ఉదయమే 5 గంటల కల్లా నిద్రలేచి వారివారి పనుల్లో
నిమగ్నమయ్యేవారు. అప్పుడు కష్టంతోపాటు తగిన విశ్రాంతి కూడా తీసుకునేవారు. మంచి
ఆహారం కూడా తీసుకునేవారు. కాబట్టి అప్పటివారు ఆరోగ్యంగా ఉండేవారు. కానీ కాలం
మారిపోయింది. మనుషులు కాలం వెంట పరుగెడుతూ ఉన్నారు.
ప్రతి రోజూ కనీసం 8గంటలు
నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా భావిస్తారు. ఎందుకంటే రోజుమొత్తంలో ఎన్నోపనులతో శరీరం
మరిము మెదడు అలసట చెంది ఉంటుంది. కాబట్టి, శరీరానికి మరియు
మెదడుకు తగినంత విశ్రాంతి కల్పించినప్పుడే, మరుసటి రోజున
ఉత్సాహంగా ఉండగలుగుతారు.
మంచి నిద్ర వలన ప్రయోజనాలు
*నిద్ర వలన మెదడుకు
విశ్రాంతి దొరుకుతుంది. దానితో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
*శరీరంలో రోగ నిరోధక
శక్తిని అభివృద్ధి చేస్తుంది.
*నాడీ వ్యవస్థ సరిగా
పనిచేసేందుకు దోహదం చేస్తుంది.
*హార్మోన్ల ఉత్పత్తి,
నియంత్రణ నిద్ర వలన సక్రమంగా జరుగుతుంది.
*ప్రతి రోజూ సరిపడా నిద్ర
పొందడం వల్ల జీవిత కాలం పెరుగుతుంది.
*కొన్ని పరిశోధనల ప్రకారం
ఎవరైతే తక్కవుగా నిద్రపోతారో వారిలో హైబ్లడ్ ప్రెజర్ లెవల్స్ ఎక్కువగా ఉండి,
ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ ను కలిగి ఉంటారు.
*ఎప్పుడైతే నిద్ర సరిగా
ఉండదో అలాంటి సమయంలో లెప్టిన్ హార్మోన్ తగ్గుముఖం పడుతుంది. దాంతో మీలో ఎక్కువగా
ఆకలి కలిగి ఎప్పుడూ తిండి ద్యాసతో బరువు ఎక్కువగా పెరుగుతారు.
*ప్రశాంతమైన నిద్ర ఒత్తిడిని
తగ్గిస్తుంది.
*ఎవరైతే గాఢంగా నిద్రపోతారో,
వారిలో నిద్రపోని వారిలో కంటే ఎక్కువ వ్యాధినిరోధకత కలిగి ఉంటారు.
మంచి నిద్రకు చిట్కాలు....
* పడుకునే ముందు
గోరువెచ్చని పాలు తాగితే నిద్ర బాడా పడుతుంది. పాలలో ఉండే న్యూరో ట్రాన్స్
మీటర్స్ ఇవి మనసుకు ప్రశాంతతను చేకూర్చి.. చక్కగా నిద్రపోయేలా చేస్తాయి.
* పడుకునే ముందు గ్రీన్ టీ
తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒత్తిడి, ఆందోళన
తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల హాయిగా నిద్రపోవచ్చు.
* రాత్రి భోజనంలో మజ్జిగ
తీసుకోవడం ద్వారా కూడా చక్కగా నిద్ర పడుతుంది. మజ్జిగలో ఉండే ట్రిప్టోఫాన్ నిద్రను
ప్రేరేపిస్తుంది.
* రాత్రిపూట అరటిపండు తినడం
వల్ల శరీరంలో రక్త సరఫరా పెరిగి ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
ఫలితంగా మంచి నిద్ర పోవచ్చు.
* బాదం పప్పు తీసుకోవడం
కండరాలు, మనసు రిలాక్స్ అవుతాయి. తద్వారా చక్కని
నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది.
* పడుకునే ముందు
చెర్రీపండ్లు తిన్నా లేదా జ్యూస్ తాగినా, అందులో ఉండే 'మెలటోనిన్' వల్ల చక్కగా నిద్ర పడుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల
ప్రకారం ఈ వివరాలను అందించాం.
0 Komentar