Bharat Biotech's Covaxin gets approval
for next phase of trials on 2–18-year-olds
భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’: 2 -18 ఏళ్ల వారిపై రెండు, మూడో దశల్లో క్లినికల్ ప్రయోగ
పరీక్షలు
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశీయ ఔషధ దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకాను చిన్నారులకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు మార్గం సుగమమైంది. త్వరలో ఈ వ్యాక్సిన్‌ను రెండేళ్ల చిన్నారుల నుంచి 18ఏళ్ల యువతపై ప్రయోగ పరీక్షలు జరపనున్నారు. వారిపై రెండు, మూడో దశల్లో క్లినికల్ ప్రయోగ పరీక్షలు జరిపేందుకు నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
2 నుంచి 18ఏళ్ల వారిపై కొవాగ్జిన్ క్లినికల్ పరీక్షలు జరిపేందుకు అనుమతి కోరుతూ భారత్ బయోటెక్ ఇటీవల దరఖాస్తు చేసింది. దీనిపై కేంద్ర ఔషధ ప్రమాణ స్థాయి సంస్థ(సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ మంగళవారం సమావేశమై చర్చలు జరిపింది. అనంతరం 2-18 ఏళ్ల వయసు చిన్నారులపై టీకా క్లినికల్ ప్రయోగాలు జరిపేందుకు ఈ కమిటీ సిఫార్సు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే మూడో దశ ప్రయోగాలు జరపడానికి ముందే రెండో దశ క్లినికల్ పరీక్షల భద్రతా డేటా, డీఎస్‌ఎంబీ సిఫార్సులను సీడీఎస్‌సీవోకు సమర్పించాలని కమిటీ భారత్ బయోటెక్‌కు షరతు విధించింది. దిల్లీ ఎయిమ్స్, పట్నా ఎయిమ్స్, నాగ్‌పూర్ మెడిట్రినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా పలు చోట్ల ఈ క్లినికల్ ప్రయోగాలు జరగనున్నాయి.
ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్
తయారుచేసిన కొవాగ్జిన్ టీకాను ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్
ప్రక్రియలో 18ఏళ్ల పైబడిన వారందరికీ ఇస్తోన్న విషయం తెలిసిందే.
దేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ చిన్నారులకు ఇప్పటి వరకు కరోనా
వ్యాక్సిన్ లేదు. ఇదిలా ఉండగా అగ్రరాజ్యం అమెరికాలో చిన్నారులకు కూడా టీకాలు
వేసేందుకు ఫైజర్‌కు అనుమతులు లభించాయి.
0 Komentar