CBSE 12th Board Exam 2021: CBSE Proposes
Two Options
12 తరగతి పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్‌ఈ, కేంద్రంకు రెండు పద్దతుల ప్రతిపాదన
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడ్డ ప్లస్ 2 పరీక్షలు నిర్వహించడానికే సెంట్రల్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌సి) మొగ్గు చూపింది. దీనికి సంబంధించి రెండు ఆప్షన్లను సిబిఎస్ఇ సూచించింది. పరీక్షల నిర్వహణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ ప్రతిపాదన చేసింది. కాగా, షార్ట్ ఫామ్‌లో పరీక్షలు నిర్వహించడంతో పాటు, పరీక్షల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు వదిలేయాలని కేంద్రం భావిస్తోందని సమాచారం.
మొదటి పద్దతి
ఇందులో మొదటి పద్దతి ప్రకారం
పరీక్షల ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి నెలలో ప్రీ
ఎగ్జామ్స్ యాక్టివిటీస్, రెండో
నెలలో పరీక్షల నిర్వహించడం, మూడో నెలలో ఫలితాలు వెల్లడి
వంటివి ఉంటాయి. అయితే పరీక్షలు ప్రధాన సబ్జెక్టులకే నిర్వహిస్తారు. ఇందులో వచ్చే
మార్కుల ఆధారంగా మిగిలిన సబ్జెక్టుల్లో మార్కులు కేటాయిస్తారు. దీని ప్రకారం జూన్‌లో
పరీక్షా తేదీలను ప్రకటించి జులైలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
రెండో పద్దతి
ఇక రెండో ఆప్షన్ ప్రకారం పరీక్షా
సమయాన్ని కేవలం 90 నిమిషాలకు కుదించి 4
సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఒకటి కచ్చితంగా భాషకు సంబంధించి అయి
ఉండాలి. మిగిలిన మూడు సబ్జెక్టులను విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. మొత్తంగా
విద్యార్థులు నాలుగు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా
మిగిలిన రెండు సబ్జెక్టులకు మార్కులు కేటాయిస్తారు.
0 Komentar