CBSE Class 12 Exams Big Update: No
Decision Yet on Pending Board Exams, Say Officials
సీబీఎస్‌ఈ: ‘12’ పరీక్షలపై నిర్ణయం తీసుకోలేదు
వాయిదా పడిన సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను బోర్డు తోసిపుచ్చింది. ఇప్పటి వరకు పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. 12వ తరగతి పరీక్షల నిర్వహణ దాదాపు రద్దంటూ కొన్ని మీడియా ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని తెలిపింది. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొంది.
దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో సీబీఎస్‌ఈ 10వ తరగతి వార్షిక పరీక్షలను ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే 12వ తరగతి పరీక్షలను వాయిదా వేశారు. అయితే, కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో 12వ తరగతి పరీక్షల నిర్వహణపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. పరీక్షల్ని పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉందన్న వార్తలు గతకొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. జూన్‌లో కరోనా వ్యాప్తి పరిస్థితిపై సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని బోర్డు గతంలోనే తెలిపింది.
మరోవైపు పరీక్షల్ని రద్దు చేయాలన్న డిమాండ్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వినిపిస్తోంది. #cancel12thboardexams2021 గత కొన్ని రోజులుగా ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షల్ని రద్దు చేయాలని కోరుతూ వేలాది మంది విద్యార్థులు కేంద్ర విద్యాశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. పదో తరగతి మాదిరిగానే తమకు కూడా ప్రత్యేక అసెస్మెంట్ ప్రక్రియ ద్వారా ఫలితాలు ప్రకటించాలని కోరుతున్నారు.
0 Komentar