‘పది’
మార్కుల కేటాయింపు విధానంపై సీబీఎస్‌ఈ నిర్ణయం - మార్కుల గణనకు సీబీఎ్‌సఈ
మార్గదర్శకాలు
80 మార్కులకు కొలమానం బడి పరీక్షల
ఫలితాలే!
అంతర్గత పరీక్షలకు 20 మార్కులు
కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను
రద్దు చేసిన సీబీఎస్‌ఈ విద్యార్థులకు మార్కుల కేటాయింపుపై మార్గదర్శకాలను ఖరారు
చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి వాటిని విడుదల చేసింది. జూన్ 20వ తేదీన ఫలితాలను
వెల్లడిస్తామని వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది
విద్యార్థులుండగా, ఏపీ, తెలంగాణల్లో దాదాపు 50 వేల మంది ఉన్నారు.
ఇదీ మార్కుల కేటాయింపు విధానం:
గతంలో మాదిరిగానే అంతర్గత పరీక్షలు
(ఇంటర్నల్ అసెస్‌మెంట్)కు 20 మార్కులు ఉంటాయి. వాటిని జూన్ 11వ తేదీ లోపు
బోర్డుకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు పంపాలి. మిగిలిన 80 మార్కులను పాఠశాలలో ఏడాది
పొడవునా వివిధ పరీక్షల్లో విద్యార్థి సాధించిన ఫలితాల ఆధారంగా కేటాయిస్తారు.
పిరియాడిక్/యూనిట్ పరీక్షలకు 10, ఆరు నెలలు/మిడ్‌టర్మ్
పరీక్షలకు 30, ప్రీ బోర్డు పరీక్షలకు 40 మార్కుల చొప్పున
ఇస్తారు. ఈ మార్కులు కేటాయించడానికి ప్రతి పాఠశాలలో ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటు
చేయాలి. దానికి ప్రిన్సిపాల్ నేతృత్వం వహిస్తారు. మిగిలిన ఏడుగురు సభ్యుల్లో
అయిదుగురు ఆ పాఠశాల ఉపాధ్యాయులు, మరో ఇద్దరు మరో పాఠశాల
నుంచి నియమించాలి. ఆయా రికార్డులను సీబీఎస్‌ఈ బృందాలు కూడా తనిఖీ చేస్తాయి. ఒకవేళ
పాఠశాల నిర్వహించిన పరీక్షలకు హాజరుకాని వారికి ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ లేదా టెలిఫోన్‌లో
ప్రశ్నలు అడిగి ప్రతిభను అంచనా వేయాలి. మార్గదర్శకాలకు భిన్నంగా మార్కులు
కేటాయించినట్లు తేలిదే జరిమానా విధిస్తాం, లేదా పాఠశాల
గుర్తింపును రద్దు చేస్తామని సీబీఎస్‌ఈ హెచ్చరించింది.
ఇదీ ఫలితాల కాలపట్టిక
మే 5 నాటికి: పాఠశాలలో కమిటీ
ఏర్పాటు
మే 25: కమిటీచే ఫలితాల ఖరారు
జూన్ 5: సీబీఎస్‌ఈకి మార్కుల
వివరాలు పంపాలి
జూన్ 11: అంతర్గత మార్కులు
పంపాలి(20కి)
జూన్ 20న: సీబీఎస్‌ఈచే ఫలితాల
వెల్లడి
0 Komentar