CBSE's 'DOST FOR LIFE' App to Counsel
Students from Class 9 To 12
విద్యార్థుల కోసం సిబిఎస్‌ఈ ‘దోస్త్
ఫర్ లైఫ్’ యాప్
కరోనా సంక్షోభం
విద్యార్థుల్లో ఒకింత ఆందోళనకు
కారణమవుతోంది. ఒకవైపు కుటుంబ సభ్యుల అనారోగ్యం , మరోవైపు పరీక్షల
ఒత్తిడి వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సెంట్రల్
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) కొత్త మొబైల్ యాప్ రూపొందించింది. 'దోస్త్ ఫర్ లైఫ్' పేరుతో అందుబాటులోకి రానున్న ఈ
యాప్ వల్ల విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించనున్నారు. 9వ తరగతి నుంచి
12వ తరగతి పిల్లల్లో కలిగే మానసిక సమస్యలను ఈ యాప్ ద్వారా పరిష్కరించనున్నారు.
విద్య, ఆరోగ్యం, ఇతర సామాజిక విషయాలపై
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు దీని
నుంచి సమాధానాలు, కౌన్సెలింగ్ పొందవచ్చు .
దేశ వ్యాప్తంగా మే 10 నుంచి(సోమవారం) ఈ యాప్ ద్వారాఉచిత కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ తెలిపింది. అందుకు ఇప్పటికే సుమారు 83 మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. ఇందులో 66 మంది మన దేశానికి చెందిన వారు కాగా మరో 17 మంది సౌదీ అరేబియా, యూఏఈ, నేపాల్, ఒమన్, కువైట్, జపాన్, అమెరికాకు చెందిన వాలంటీర్లు. వారంలో మూడు రోజులు సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కౌన్సెలింగ్ సెషన్లు ఉంటాయి. అలాగే ఈ యాప్ లో చదువుకు సంబంధించిన మెటీరియల్, సమాజం, భావోద్వేగాలు, ప్రవర్తన తదితర అంశాలకు చెందిన సమాచారం అందుబాటులో ఉంటుంది. పరీక్షల గురించి ఆందోళన, ఇంటర్నెట్ వ్యసనం, కుంగుబాటు నుంచి బయటపడేందుకు యాప్ లోని అంశాలు తోడ్పడతాయి.
0 Komentar