Centre Asks States to Notify "Black
Fungus" Under Epidemic Diseases Act
బ్లాక్ ఫంగస్‌ను నోటిఫయబుల్ డిసీజ్‌గా
రాష్ట్రాలు ప్రకటించాలి : కేంద్రం
మ్యుకొర్‌మైకోసిస్ లేదా బ్లాక్
ఫంగస్ వ్యాధిని అంటువ్యాధుల చట్టం, 1897 ప్రకారం నోటిఫయబుల్
డిసీజ్‌గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
గురువారం కోరింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ
శాఖ (ఎంఓహెచ్ఎఫ్‌డబ్ల్యూ), భారత వైద్య పరిశోధన మండలి
(ఐసీఎంఆర్) జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది. మ్యుకొర్‌మైకోసిస్
పరీక్షలు, రోగ నిర్థరణ, నిర్వహణకు
సంబంధించి ఈ మార్గదర్శకాలు వివరిస్తున్నాయి.
మ్యుకొర్‌మైకోసిస్ పరీక్షలు, రోగ
నిర్థరణ, మేనేజ్‌మెంట్ కోసం ఎంఓహెచ్ఎఫ్‌డబ్ల్యూ, ఐసీఎంఆర్ జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు, వైద్య కళాశాలలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తెలిపింది.
మ్యుకొర్‌మైకోసిస్ లేదా బ్లాక్
ఫంగస్ అత్యంత అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది మన దేశంలో ఢిల్లీ సహా కొన్ని
రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి వస్తోందని కేంద్ర
ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వాతావరణంలోని శిలీంధ్ర జీవ కణాలు (ఫంగల్
స్పోర్స్) సోకినపుడు మానవులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
Telangana:
తెలంగాణలో ఎక్కడైనా బ్లాక్ ఫంగస్ (Mucormycosis) కేసులు నమోదైతే తమకు తప్పకుండా సమాచారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం
ఆదేశాలు జారీ చేసింది. అంటువ్యాధుల చట్టం 1897 ప్రకారం
మ్యూకర్ మైకోసిస్ ద్వారా కలిగే బ్లాక్ ఫంగస్ సమస్యను నోటిఫైబుల్ వ్యాధి అని
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ,
ప్రైవేట్ ఆస్పత్రులు బ్లాక్ ఫంగస్ (Black Fungus Infection) కేసులు గుర్తిస్తే తెలంగాణ వైద్యశాఖకు, రాష్ట్ర
ప్రభుత్వానికి తక్షణమే సమాచారం అందించాల్సి ఉంటుంది.
Andhra Pradesh
HM&FW Department – Covid-19 -
Notification of Mucormycosis under Epedemic Diseases Act, 1897 - issued.
G.O.MS.No. 56 Dated: 20-05-2021.
0 Komentar